నాటుసారా తయారీని అరికట్టి తయారీదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన మహిళా సంఘాలు ఎస్ఈబీ అధికారులకు విజ్ఞప్తి చేశాయి. గొలుగొండలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. కొయ్యూరు మండలం బకులురు పంచాయితీకి చెందిన 29 డ్వాక్రా సంఘాలు 350 సభ్యులతో కలిసి ఆందోళన దిగారు.
గ్రామంలో నాటు సారా విపరీతంగా పెరిగిపోయిందనీ, దీంతో చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. వీరంతా పనులు మానుకొని వాహనంపై తరలివచ్చి లిఖతపూర్వకంగా పిర్యాదు అందజేశారు.