విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలో వైన్ షాప్ను మూసివేయాలని స్థానిక మహిళలు వైన్ షాప్ వద్ద బైఠాయించారు. నగరంలో కరోనా విస్తృతంగా ఉండడం వల్ల పక్కనే ఉన్న వెంకన్నపాలెంలో వైన్ షాప్ బంద్ చేశారు. ఆరిపాక గ్రామంలో ఉన్న వైన్ షాప్ ఒక్కటి మాత్రం తెరిచి ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా మద్యం బాబులు ఇక్కడికి వస్తున్నారు. దీంతో తమ ఊర్లో కరోనా లేకుండా ప్రశాంతంగా ఉన్నామని.. కరోనా వస్తుందేమోనని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వైన్ షాప్ను మూసివేయాలని మహిళలు డిమాండ్ చేశారు.
సబ్బవరంలో వైన్ షాప్ మూసేయాలని మహిళల ధర్నా - సబ్బవరం లో వైన్ షాప్ మూసేయాలని మహిళల ధర్నా
విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలో వైన్ షాప్ను మూసివేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కరోనా నియంత్రణ కోసమే తాము కోరుతున్నామని వివరించారు.
సబ్బవరం లో వైన్ షాప్ మూసేయాలని మహిళల ధర్నా