విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళా విభాగం సారథ్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితలు అతిథులుగా పాల్గొని.... పార్టీకి సుదీర్ఘ కాలం సేవలు అందించిన మహిళలను సత్కరించారు. మహిళలకు అన్ని విధాలా అండగా నిలిచిన పార్టీ తెదేపా అని వారు పేర్కొన్నారు. మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి... చేయకుండా వైకాపా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని అనిత విమర్శించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు, మహిళలే బుద్ది చెప్పాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు.
విశాఖ తెదేపా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు - international womens day
విశాఖలోని తెదేపా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలను సత్కరించారు.
విశాఖ తెదేపా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు