అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సంగీత విభాగం ఆవరణలో మొక్కలు నాటారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం అకడమిక్ డీన్ పి. వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలు, పువ్వుల్లాగే మహిళలు ఎంతో సున్నితమైన వారన్నారు. సమాజంలో వారు నిర్వహించే పాత్ర చాలా ముఖ్యమైందని చెప్పారు. సమాజంలో మహిళలు సగభాగం అయినా.. వారు నిర్వహించే పాత్రలు మాత్రం సామాజికంగా 75% ఉన్నాయని సంగీత విభాగాధిపతి అనురాధ స్పష్టం చేశారు.
'సమాజంలో మహిళల పాత్ర అమోఘం' - ఏయూలో మహిళా దినోత్సవాలు
ఏయూలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. సమాజంలో మహిళల పాత్ర అమోఘమని యూనివర్సిటీ అకడమిక్ డీన్ పి. వెంకటరావు అన్నారు.
!['సమాజంలో మహిళల పాత్ర అమోఘం' womens day celebrations at andra university(au) in visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6335627-678-6335627-1583638219960.jpg)
పువ్వులు లాగే మహిళలు సున్నితం.. సమాజంలో వారి పాత్ర అమోగం
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా దినోత్సవం