విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గాజువాక తెదేపా కార్యాలయం వద్ద ఉక్కు ఉద్యోగులు.. నిర్వాసితులకు మద్దతుగా 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పల్లా దీక్షకు మద్దతుగా మహిళల కొవ్వొత్తుల ర్యాలీ - మహిళల కొవ్వొత్తుల ర్యాలీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజూ కొనసాగుతోంది.
![పల్లా దీక్షకు మద్దతుగా మహిళల కొవ్వొత్తుల ర్యాలీ Women's candlelight rally in support of Palla srinivas rao Deeksha against vizag steel privitization](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10616074-863-10616074-1613228948719.jpg)
పల్లా దీక్షకు మద్దతుగా మహిళల కొవ్వొత్తుల ర్యాలీ