ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Mother suicide with children : ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య - visakha mother and children suicide

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

By

Published : Feb 28, 2022, 8:41 PM IST

Updated : Mar 1, 2022, 5:52 AM IST

20:36 February 28

విశాఖ జిల్లాలో విషాదం

Mother suicide with children : భార్యాభర్త.. ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు.. అన్యోన్యంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంటుంది. ఇద్దరు కుమార్తెలను చంపి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఉదంతం విశాఖ జిల్లా అనకాపల్లిలో కలకలం రేపింది. దీనికి సంబంధించి డీఎస్పీ సునీల్‌, పట్టణ సీఐ భాస్కరరావు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన మెట్ట జనార్దనరావుకు తన అక్క కూతురు అనూషతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. జనార్దనరావు అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అనకాపల్లి ఉమ్మలాడ రోడ్డులోని ఒక ఇంట్లో ఏడు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి సుదీక్ష(5), గీతాన్విత (1.5సం.లు) ఇద్దరు కుమార్తెలు. జనార్దనరావు ఉద్యోగానికి సెలవు పెట్టి శనివారం స్వగ్రామం మెట్టపేట వెళ్లాడు. సోమవారం సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్‌కి భార్య అనూష ఉరేసుకుని ఉంది. కుమార్తెలిద్దరూ కింద పడి ఉన్నారు. వెంటనే 100కి సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమార్తెలు ఇద్దర్నీ చున్నీతో ఉరి వేసి వారు చనిపోయాక అనూష ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.

* ఇద్దరు కుమార్తెలను చంపి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సంఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ను సేకరించారు. ఇది అనూష రాసిందేనా అని పరిశీలిస్తున్నారు. సూసైడ్‌ నోట్‌లోని వివరాలు, మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు వివాహిత ఆత్మహత్య వెనక ఇంటి యజమాని పాత్ర ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి :ap crime news : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి

Last Updated : Mar 1, 2022, 5:52 AM IST

ABOUT THE AUTHOR

...view details