తమకు అర్హత ఉన్నప్పటికీ ఇంటి స్థలం రావడం లేదంటూ విశాఖ జిల్లా భీమునిపట్నానికి చెందిన ఓ మహిళ మంత్రి అవంతిని ప్రశ్నించింది. పట్టణంలోని 23వ వార్డులో రహదారులు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి అనంతరం.. స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఓ మహిళ తమ సమస్యను మంత్రికి తెలిపింది. మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా.. తన పేరును జాబితాలో లేకుండా చేశారని ఆరోపించింది. వెంటనే స్పందించిన మంత్రి.. సంబంధిత వాలంటీర్ ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.
'మంత్రి గారూ.. నాకు ఎందుకు ఇంటి స్థలం ఇవ్వరు?'
తమకు అర్హత ఉన్నప్పటికీ ఎందుకు ఇంటి స్థలాన్ని కేటాయించలేదంటూ.. మంత్రి అవంతి శ్రీనివాస్‌ను ఓ మహిళ ప్రశ్నించింది. స్పందించిన మంత్రి... బాధితురాలి దరఖాస్తును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
women question to minister avanthi over free land distribution