విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ... వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా స్థానిక సర్పంచ్ సంజీవ్... తనను కులం పేరుతో దూషించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కొత్తకోట పోలీసులు... సర్పంచ్‌తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వాలంటీర్... అసత్య ఆరోపణలు చేస్తున్నారని పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు ఆందోళన చేశారు. సర్పంచ్ సంజీవ్‌ను అరెస్టు చేయవద్దని నినాదాలు చేశారు.