ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 24, 2023, 5:14 PM IST

ETV Bharat / state

మెడికల్​ షాపు దిక్కు లేని ఊర్లో మద్యం దుకాణమా..!

Women Protest Against Wine Shop : మా ఊర్లో వైన్​ షాప్​ పెట్టడం ఏంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. కనీస సౌకర్యాలైన రోడ్డు, నీరు, సరైన గృహాలు లేవు.. వాటిని పట్టించుకోని ప్రభుత్వం.. ఇలా చేయడం సరికాదన్నారు. దశల వారీగా మద్యం తగ్గిస్తామని చెప్తున్న ప్రభుత్వం.. కొత్తగా దుకాణాలు పెంచడం సిగ్గుచేటని ఆ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా రామకృష్ణాపురంలో మద్యం దుకాణం వద్దని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మద్యం షాపు
మద్యం షాపు

మా ఊరిలో మద్యం షాపు వద్దు

Women Protest Against Wine Shop : విశాఖ రామకృష్ణాపురంలో.. మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళలు ఆందోళన చేపట్టారు. గ్రామ శివార్లలో ఏర్పాటు చేయాల్సిన మద్యం దుకాణం నివాసాలకు దగ్గరలో ఏర్పాటు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేని ప్రభుత్వం.. మద్యం దుకాణం పెట్టేందుకు యత్నిస్తుందని వాపోయారు. దశల వారీగా మద్యం నిషేధిస్తామన్న ప్రభుత్వం నూతన దుకాణాలను పెట్టేందుకు చర్యలు ఎందుకు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ సెంట్రల్ జైల్ సమీపంలో ఉన్న రామకృష్ణాపురంలో ప్రభుత్వం మద్యం దుకాణం పెట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఐతే నివాస గృహాల మధ్యలో, అందులోనూ తమ గ్రామంలో మద్యం దుకాణం పెట్టడానికి ఒప్ఫకోమని మహిళలు నిరసన తెలిపారు. దశలవారీగా మద్యం తగ్గిస్తామని చెప్తున్న ప్రభుత్వం.. కొత్తగా దుకాణాలు ఎందుకు పెంచుతోందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రామకృష్ణాపురంలో కనీసం రోడ్లు లేవని, సరైన రవాణా సదుపాయాలు, త్రాగడానికి మంచి నీళ్లు లేవని.. ఏదైనా అనారోగ్యం పాలైతే సరైన వైద్యశాల.. ఒక మెడికల్ షాప్ కూడా లేదని తెలిపారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణంపై పెట్టిన శ్రద్ధ.. ప్రభుత్వం తమ బ్రతుకుల మీద పెట్టి ఉంటే బాగుండేది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం పెట్టడానికి వీల్లేదని ఖరాకండిగా చెబుతున్నారు. ఏళ్లుగా ఉంటున్న తమ ప్రాంతలో సరైన బస్ స్టాప్ లేదు, కానీ బ్రాందీ షాప్​ కోసం తమ ఊరు కావలసి వచ్చిందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఊరి కోసం అభివృద్ది కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వం ఆ ఆలోచన మానేసి.. ఇలాంటి తప్పుడు ఆలోచన చేయడం సరికాదని.. రామకృష్ణపురం గ్రామస్థులు అంటున్నారు.

మద్యం దుకాణం పెడితే తమ శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని గ్రామస్థులు పేర్కొన్నారు. దీనికి ఫలితంగా తాగుబోతులు పెరిగి కుంటుంబాలు నాశనమౌతాయని తెలిపారు. అంతేకాకుండా మద్యం తాగి గొడవలు చేసే ఆకతాయిల వల్ల ఆడవాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. మా ఊరిలో మద్యం దుకాణం ఏర్పాటుకు మేము ఒప్పుకోమని గ్రామస్థులు తేల్చి చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details