మహిళలు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని విశాఖ జిల్లా జడ్జి హరిహరనాథ శర్మ సూచించారు. పెందుర్తిలోని సమాఖ్య భవనంలో మహిళల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
'మహిళలు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలి' - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లా పెందుర్తిలో మహిళల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారానికి న్యాయ సేవలు ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి హరిహరనాథ శర్మ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు ఇచ్చారు.
!['మహిళలు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలి' vishaka district judge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8861924-132-8861924-1600522086484.jpg)
vishaka district judge
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, జాతీయ మహిళా కమిషన్ దిశానిర్దేశంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో... న్యాయ సేవలు ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై మహిళలకు అవగాహన కల్పించారు. జాతీయ మహిళా కమిషన్ ద్వారా శిక్షణ పొందిన బి.అనంతలక్ష్మి అనే మహిళ.... పలు చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారులు పాల్గొన్నారు.