ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో వివాహిత దారుణ హత్య - విశాఖలో వివాహిత దారుణ హత్య వార్తలు

ఓ వివాహితను దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Women murder in vishaka

By

Published : Oct 23, 2019, 12:55 AM IST

విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో దారుణం చోటు చేసుకుంది. మునసబ్​గారి వీధిలో నివాసం ఉంటున్న వివాహిత అప్పలనర్సమ్మను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. రెండు రోజులుగా ఆమె సెల్​ఫోన్ స్విచ్ఛాఫ్ రావటంతో అక్కను చూసేందుకు వచ్చిన చెల్లి..ఇంట్లో నుంచి దుర్వాసన రావటం గమనించింది. స్థానికుల సాయంతో ఇంటి తాళాలు పగలగొట్టారు. అప్పలనర్సమ్మ పడిపోయి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కొంత కాలంగా భర్తతో గొడవల నేపథ్యంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు మృతురాలి సోదరి తెలిపింది.

వివాహితను హత్య చేసిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details