ప్రభుత్వం ప్రజలకు మాస్కులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో కె.కోటపాడు ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థలో.. మాస్కులు కుడుతూ డ్వాక్రా మహిళలు ఉపాధి పొందుతున్నారు. డీఆర్డీఏ నుంచి వాటి తయారీకి ఆర్డర్ ఇచ్చారు.
ఇక్కడి కేంద్రంలో వంద మంది వరకు మహిళలు మాస్కుల తయారీతో ఉపాధి పొందుతున్నారు. ప్రతిరోజు దాదాపుగా ఆరు వేలకు పైగా మాస్కులు తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.