ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధార్ కేంద్రాల వద్ద పొటెత్తిన మహిళలు - విశాఖ జిల్లా తాజా వార్తలు

విశాఖ జిల్లా చీడికాడలో ఆధార్ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఆధార్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలిరావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఆధార్ కేంద్రాల వద్ద జనం
ఆధార్ కేంద్రాల వద్ద జనం

By

Published : May 27, 2021, 5:26 PM IST

వైఎస్సార్ చేయూత పథకానికి అర్హులైన మహిళలు.. వారి ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ అనుసంధానం కావాలనే నిబంధనతో మహిళలు ఆధార్ కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. విశాఖ జిల్లా చీడికాడలోని ఆధార్ కేంద్రానికి చట్టుపక్కల మండలాల గ్రామాల నుంచి వందల సంఖ్యలో వచ్చారు. వాహనాలపై వచ్చి ఉదయం నుంచి మహిళలు ఆధార్ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఆధార్ కేంద్రానికి పెద్ద ఎత్తున తరలిరావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆధార్ కేంద్రాల వద్ద తోపులాట జరగటంతో పోలీసులు అదుపు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైఎస్సార్ చేయూత పథకానికి ఆధార్ ఫోన్ లింక్ ప్రతిపాదన మినహయింపు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details