ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యూపీలో గోవులకున్న రక్షణ స్త్రీలకు లేదు : మహిళా సంఘాలు

ఉత్తర్​ప్రదేశ్​లోని హతరస్ జిల్లాలో ఎస్సీ మహిళపై జరిగిన దారుణ హత్యను ఖండిస్తూ ఎస్సీ మహిళా సంఘాల ఐక్యవేదిక నిరసన కార్యక్రమం చేపట్టింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్​ హయాంలో ఆవులకున్న రక్షణ మహిళలకు లేదని ఎస్సీ సంఘాల కన్వీనర్ సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు.

యూపీలో గోవులకున్న రక్షణ స్త్రీలకు లేదు : ఎస్సీ మహిళా సంఘాలు
యూపీలో గోవులకున్న రక్షణ స్త్రీలకు లేదు : ఎస్సీ మహిళా సంఘాలు

By

Published : Oct 1, 2020, 6:59 AM IST

ఉత్తరప్రదేశ్​లోని హతరస్ జిల్లాలో ఎస్సీ మహిళపై జరిగిన దారుణ హత్యను ఖండిస్తూ ఎస్సీ మహిళా సంఘాల ఐక్యవేదిక ధర్నా నిర్వహించింది. కన్వీనర్ సరస్వతి ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర దళిత మహిళలు నిరసన చేపట్టారు.

ఎస్సీలవే అత్యధికం..

ఉత్తరప్రదేశ్​లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హయాంలో ఆవులకున్న రక్షణ రాష్ట్ర మహిళలకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 3960 కేసులు నమోదైతే అందులో ఎస్సీలవే అత్యధికమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారికి ఉరిశిక్ష వేయాలి..

ఎక్కువశాతం గోవుల పేరుతో హత్యలు, దళిత మహిళలపై అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులందరికీ వెంటనే ఉరిశిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి : మంత్రి సీదిరి అప్పలరాజుకు మత్య్సకారుల సన్మానం

ABOUT THE AUTHOR

...view details