విశాఖపట్నం జిల్లా పాడేరులో ఓ మహిళ మృతి స్థానికంగా కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఆమె.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా కరోనా వైరస్‌తోనే మృతురాలు చనిపోయిందంటూ వదంతులు వ్యాపించాయి. ఈ విషయాన్ని ఏడీఎమ్ హెచ్ఓ లీలా ప్రసాద్‌కు తెలియజేయగా.. మృతదేహం నుంచి రక్త నమూనాలు సేకరించి పరిశీలించారు. ఈ ఫలితాలలో కరోనా నెగటివ్ రావడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా మృతురాలిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వాసిగా గుర్తించారు.
పాడేరులో కలకలం రేపిన మహిళ మరణం - విశాఖపట్నం జిల్లా నేరాలు
విశాఖపట్నం జిల్లా పాడేరులో మహిళ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కరోనా వైరస్‌తోనే ఆమె మరణించిందంటూ వదంతులు రాగా... అధికారులు రక్త నమూనాలు పరిశీలించి కొవిడ్ నెగటివ్‌గా తేల్చారు. ఈ ఫలితాలతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
పాడేరులో కలకలం రేపిన మహిళ మరణం