విశాఖ జిల్లా మల్కాపురం ప్రియదర్శిని కాలనీలో అలేఖ్య అనే వివాహిత బాత్రూంలో అనుమానాస్పదంగా మరణించింది. ఆమె ఇద్దరు పిల్లల ఏడుపులు విని చుట్టుపక్కల వాళ్ళు... మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి బంధువులకు సమాచారమిచ్చారు. సాయంత్రం డాగ్ స్క్వాడ్ రంగంలో దింపి దర్యాప్తు చేశారు. భర్త రాజకుమార్ మర్చంట్ నేవిలో ఉద్యోగం చేస్తున్నాడు. అజ్ఞాతవ్యక్తి రోజు వస్తూ ఉంటాడని స్థానికులు చెప్పటంతో...ఆ వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మల్కాపురం సీఐ ఉదయకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మల్కాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి - విశాఖలో అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
విశాఖ జిల్లా మల్కాపురం ప్రియదర్శిని కాలనీలో వివాహిత అలేఖ్య బాత్రూంలో అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇద్దరు చిన్న పిల్లల ఏడుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు చూసి మల్కాపురం పోలీసులకు సమాచారం అందిచారు.
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి