విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా సోకిన యువతి ఆత్మహత్య చేసుకుంది. అనకాపల్లి ఉప్పలవారి వీధిలో నివాసం ఉంటున్న లింగం అనురాధ (32) దువ్వాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి, అన్నయ్యతో ఉంటున్న అనురాధకి కరోనా సోకింది. రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. వైరస్.. తన తల్లి, అన్నయ్యకు సోకుతుందని ఆందోళనతో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కరోనా భయం... తీసింది ప్రాణం - corona fear anakapalli woman suicide
కరోనా భయం నిండు ప్రాణాన్ని తీసింది. తల్లి, అన్నయ్యకు కరోనా సోకుతుందేమోనన్న ఆందోళన ఆత్మహత్యకు దారితీసింది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఓ యువతికి కొవిడ్ సోకింది. తన కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఆత్మహత్యపై ఆమె అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరోనా భయం... తీసింది ప్రాణం
అనురాధ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె అన్నయ్య నరసింగరావు అనకాపల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై రామకృష్ణ తెలిపారు. మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
ఇదీ చదవండి :'ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి కావాల్సింది సెల్యూట్ కాదు... పీపీఈ కిట్లు'