ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి - woman suicide attempt in suspicious condition at maharani street in visakhapatnam

అనుమానాస్పద స్థితిలో... మహిళ ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా మహారాణి వీధిలో జరిగింది.

woman died in suspicious condition in visakhapatnam
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖ మహిళ

By

Published : Apr 9, 2020, 5:20 PM IST

విశాఖ జిల్లా మర్రిపాలెం మహారాణీ వీధికి చెందిన స్వరూపారాణి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆమె అత్మహత్యకు పాల్పడింది. అత్త, కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పగా... మృతదేహాన్ని కేజీహెచ్​కు తరలించారు. తమ కుమార్తెను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఎయిర్​పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ జోన్ ఏసీపీ జి.స్వరూపారాణి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి భర్త ముప్పిడి గౌరీ ప్రసాద్​తో పాటు అతడి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్​మార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడుతామని ఏసీపీ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details