Love Confusion: మీతో సన్నిహితంగా ఉండే తను వేరొకరితోనూ ఎందుకు క్లోజ్‌గా ఉండకూడదు? అలా చేయడం వాళ్లిద్దరి వ్యక్తిగతం. కాదనడానికి మీరెవరు? ఒకవేళ మీరు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నారా? అదే గనక నిజమైతే మీది కేవలం ఆకర్షణే తప్ప నిజమైన ప్రేమ కాదు. ఆన్‌లైన్‌లో పరిచయం, చాటింగ్, ఫోన్లు మాట్లాడుకోవడం.. వీటినే ప్రేమగా పొరబడుతున్నారు ఈ కాలం అమ్మాయిలు, అబ్బాయిలు చాలామంది. ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి అనవసర సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే అతడితో మీది ప్రేమే కాదు. ఆ అమ్మాయి విషయానికొస్తే.. తను బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. అందులోనూ వాస్తవం లేదనిపిస్తోంది. ఒకవేళ అదే గనక నిజమైతే తను మీతో అన్ని విషయాలూ పంచుకునేది. మీరు బాధ పడుతున్నారని తెలిస్తే.. మిమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నించేది. ఒకవేళ వాళ్లిద్దరి మధ్య ప్రేమలాంటిది ఏదైనా ఉంటే నిర్భయంగా మీతో పంచుకునేది.