విశాఖ జిల్లా పాడేరు లోచలిపుట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన నూకరత్నం ఐటీడీఐ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య లక్ష్మీ ఆరుబయట చింతపండు ఎండ పెడుతుండగా..అదుపుతప్పి జీపు ఆమె పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయం కావటంతో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కాగా మార్గ మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉండగా..ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Accident: జీపు ఢీకొని మహిళ మృతి - జీపు ఢీకొని మహిళ మృతి న్యూస్
జీపు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా లోచలిపుట్టు ఐటీడీఏ కాలనీలో జరిగింది. మృతురాలు ఆరు బయట చింతపండు ఎండ పెడుతుండగా అదుపుతప్పి జీపు ఆమె పైకి దూసుకొచ్చింది.

జీపు ఢీకొని మహిళ మృతి