ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. భార్య మృతి, భర్తకు గాయాలు - కొత్తూరు జాతీయ రహదారి వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో భార్య మరణించగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

road accident at kothuru, lorry hit two wheeler at kothuru
కొత్తూరు వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ, ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని మహిళ మృతి

By

Published : Apr 18, 2021, 9:43 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఆర్మీలో పని చేస్తున్న మహేశ్వరరావు.. తన భార్య విజయలక్ష్మితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పాయకరావుపేట వెళ్తున్న సమయంలో వెనకనుంచి లారీ ఢీకొట్టింది. భార్య మృతి చెందగా.. తీవ్రగాయాలపాలైన మహేశ్వరరావు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:రసాయన కంపెనీలో మంటలు- ముగ్గురు మృతి

మహేశ్వరరావు, విజయలక్ష్మికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాయకరావుపేట ప్రైవేట్ పాఠశాలలో వీరు చదువుకుంటున్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ స్వామి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

లారీ కిందకి దూసుకెళ్లిన బైక్​.. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details