విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి వద్ద ఓ మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. మృతదేహం సగ భాగం జంతువులు తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. భయంకరమైన ఈ దృశ్యాన్ని చూసినవారు పరుగులు పెట్టారు. విశాఖ- పాడేరు ఘాట్ రోడ్డు పక్కనే ఆమె భౌతిక కాయం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు... ఆ మహిళ ఎవరన్న విషయంపై విచారణ చేస్తున్నారు.
విశాఖ మన్యంలో మహిళ మృతదేహం కలకలం - పాడేరు తాజా వార్తలు
విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి వద్ద మహిళ మృతదేహం కలకలం స్పష్టించింది. భీతి గొలిపేలా ఉన్న దృశ్యాన్ని చూసినవారు పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

dead body