సింహాచలం వివాదం సద్దుమణిగింది. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చొరవతో సమస్యకు తెర పడింది. ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులపై వేసిన సస్పెన్షన్ వేటును ఉపసంహరించింది ప్రభుత్వం. ఈమేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ జరిగింది...
లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరిన విశాఖ జిల్లా సింహగిరిపై చందనోత్సవ వేళ నిబంధనలకు విరుద్ధంగా ఒక వ్యక్తిని అప్పన్న నిజరూప దర్శనానికి తీసుకువెళ్లినట్లు ప్రధాన అర్చకుడిపై ఆరోపణలు వచ్చాయి. దీనికి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులే కారణమని సింహాచలం ఈవో భావించారు. అనుమతి లేని వ్యక్తి నిజరూప దర్శనానికి వెళ్లిన వివాదం మీడియాలో రావటంతో ప్రాథమిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రధానార్చకుడిపై సస్పెన్షన్ వేటు వేశారు.