ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా వైరస్ పై విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో కరోనా వైరస్ వైద్య సేవలకు ముందస్తుగా ఒక ప్రత్యేక వైద్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖ విమానాశ్రయంలో ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులు... విదేశాలకు వెళ్లిన వారు, విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఏదైనా అనుమానం ఉంటే వారికీ వైద్య సేవలు అందించే ప్రణాళిక సిద్ధం చేశారు. దీని కోసం వాల్తేర్‌లోని అంటువ్యాధులు నివారణ ఆసుపత్రిలో అదనంగా మరో పది పడకల వార్డు ఏర్పాటు చేశారు. పోర్టులకు ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన నౌకలు ఏమైనా ఉంటే వాటిని కూడా అప్రమత్తం చేసేందుకు సిద్ధం చేశారు. కరోనా వైరస్‌పై చైతన్యం కల్పించడం, నివారణకు... జిల్లా వైద్య శాఖ, కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కళాశాలలు సంయుక్తంగా సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు.
జర జాగ్రత్త!