ఉత్తరాంధ్రకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. అనకాపల్లిలో ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని తమ ప్రభుత్వం ప్రారంభిస్తే... వైకాపా ప్రభుత్వం దాన్ని పులివెందులకు తరలించిందని తెలిపారు. పులివెందుల కోసం ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'పులివెందుల కోసం ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తారా?' - వైకాపా పాలనపై అయ్యన్నపాత్రుడు విమర్శలు
వైకాపా పాలనపై తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనకాపల్లిలో ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని పులివెందులకు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. అలాగే చిన్న ప్రాజెక్టు కట్టిన అనుభవం లేని సంస్థకు పోలవరాన్ని ఎలా కట్టబెట్టారని నిలదీశారు.
ayyanna patrudu
అలాగే వైకాపా ఏడాది పాలనలో పోలవరానికి తట్టెడు మట్టి వేయలేదని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. రీ టెండరింగ్ పేరుతో పోలవరం ఆలస్యం చేశారని దుయ్యబట్టారు. ఆలస్యమైతే నిర్మాణ వ్యయం పెరుగుతుందని ఆలోచించరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 50 మంది సలహాదారులు ఏం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మేఘా సంస్థ ఎప్పుడైనా చిన్న ప్రాజెక్టును కట్టిన అనుభవం ఉందా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అనుభవం లేని వాళ్లు ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.