ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుషికొండ బీచ్‌... ప్రపంచం మనసు గెలుస్తుందా ? - సముద్రతీరం

రుషికొండ తీరానికి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోసం పర్యాటక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇక్కడ చేపట్టిన పనులు, శుభ్రత చర్యలు, నీటి స్వచ్ఛత అంశాలపై జూన్ నాటికి కేంద్రానికి నివేదిక అందించనున్నారు.

రుషికొండ సముద్రతీరం

By

Published : May 1, 2019, 4:22 PM IST

అందాల తీరం.. అరుదైన గుర్తింపు కోసం ఆరాటం

విశాఖ తీరంలోని బీచ్‌లకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి పర్యాటకులకు అనువైనదని చెప్పే యత్నాలు జోరందుకున్నాయి. డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగన్‌లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్​మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ బ్లూ ఫ్లాగ్ ఈ గుర్తింపు ఇవ్వనుంది. తనకందిన నివేదికను కేంద్రమే ఆ సంస్థకు పంపిస్తుంది. ఈ అభ్యర్థనతో ఆ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. నీటి స్వచ్ఛత, లావణ్యత, గాఢత, కలుషిత వాతావరణం అంశాలు పరిగణనలోకి తీసుకుని గుర్తింపు ఇవ్వాలో.. వద్దో నిర్ణయిస్తారు. దీనికి ఒకట్రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
13 తీరాల్లో రుషికొండ ఒకటి
దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్రం 13 తీర ప్రాంతాల అభివృద్ధికి నిర్ణయించింది. అందులో ఒకటి రుషికొండ బీచ్‌. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా బ్లూఫ్లాగ్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది. సదుపాయాల కల్పనకు నిధులు విడుదల చేసింది. సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్​మెంట్​ వీటిని అభివృద్ధి చేస్తుంది.

ఎవరికి అభివృద్ధి బాధ్యతలు
రుషికొండ సహా ఒడిశాలోని చంద్రభాగ బీచ్ అభివృద్ధి పనులను పుణెకు చెందిన బి.వి.జి నిర్మాణ సంస్థకు అప్పగించారు. ఒక్కో బీచ్‌కు 7 కోట్ల 30 లక్షల రూపాయిలు ఖర్చు చేసింది. ఆధునిక ప్రమాణాల మేరకు సహజ వాతావరణం దెబ్బతీయకుండా తీరాలను అభివృద్ధి చేయాలి. ఇది విజయవంతమైతే ఏపీలో బ్లూ ఫ్లాగ్ కింద గుర్తింపు పొందిన మొదటి బీచ్‌గా రుషికొండ పేరు తెచ్చుకోనుంది.

ఏంటీ బ్లూప్లాగ్‌?
ఏ తీర ప్రాంతానికైనా ఎఫ్ఈఈ నుంచి బ్లూ ప్లాగ్ గుర్తింపు పొందడం అంత సులభం కాదు. పర్యావరణానికి సంబంధించి 30కిపైగా అంశాల్లో నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ప్లాస్టిక్ అనేది కనిపించకూడదు. కాలుష్య కారకాలు కనుచూపు మేరలో ఉండకూడదు. చెత్త నిర్వహణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి. సందర్శకులు స్నానానికి శుభ్రమైన నీటినే వినియోగించాలి. ప్రస్తుతం శుభ్రత చర్యలు కఠినంగా పాటిస్తున్నందున మిగిలిన బీచ్‌లతో పోల్చుకుంటే లావణ్యత ఇక్కడ తక్కువగా ఉంది.


ABOUT THE AUTHOR

...view details