విశాఖ మన్యంలో వరుస హత్యలు జరుగుతున్నాయి. భూతగాదాల నేపథ్యంలో జి.మాడుగుల సంతలో పెద్దనాన్ననే తమ్ముడి కుమారుడు బ్లేడ్‌తో దాడి చేసి చంపాడు. ఈ ఘటనను మరవకముందే పెదబయలులో మరో హత్య జరిగింది.
దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య - భర్తను గొడ్డలితో చంపిన భార్య
విశాఖ ఏజెన్సీలో మరో దారుణం జరిగింది. రోజులు కూడా గడవక ముందే మరో అఘాయిత్యం చోటు చేసుకుంది. వేధింపులు భరించలేక భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది.
సిరసపల్లి గ్రామంలో బొంజుబాబును భార్య హత్య చేసింది. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. భర్త వేధింపులు భరించలేక భార్య బాలమ్మ గొడ్డలితో నరికి చంపింది. మారుమూల ప్రాంతం కావడంతో దహన సంస్కారాలకు గ్రామస్తులు అంతా సిద్ధం చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దహన సంస్కారాలను అడ్డుకున్నారు. ఉదయం నుంచి కొడుకే చంపాడంటూ వార్తలు దావనంలా వ్యాపించాయి. పోలీసులు విచారించగా.. వేధింపులు భరించలేక తానే హత్య చేశానని బాలమ్మ ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చూడండి: గవర్నర్‌గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం నేడే..