కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, సరోజినీలు భార్యాభర్తలు. కొంత కాలంగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వీరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో శ్రీనివాసరావు ఆవేశంతో భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్‌టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
భర్త చేతిలో భార్య దారుణ హత్య - ANDRAPRADESH CRIME
విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య నెలకొన్న గొడవలో విచక్షణ కోల్పోయిన భర్త భార్యను అతి కిరాతకంగా అంతమొందించాడు. ఊహించని ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మహిళ మృతదేహం
ఇదీచదవండి.తాగుడుకు బానిసయ్యాడని కన్నబిడ్డపై కత్తితో తల్లి దాడి