ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూతురు వివాహం తెచ్చిన తంటా.. భర్తను చంపిన భార్య - కూతురు పెళ్లి గొడవ.. భర్తను చంపిన భార్య

కూతురు పెళ్లి వివాదం కారణంగా ఆ దంపతుల మధ్య గొడవలు వచ్చాయి. కులాంతర వివాహం చేయడం కూతురి తండ్రికి ఇష్టం లేదు. భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరూ.. శత్రువుల్లా మారారు. అంతే... భార్య భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది.

wife killed
wife killed

By

Published : May 27, 2020, 12:18 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం గుర్రంధరపాలెం గ్రామానికి చెందిన సన్యాసమ్మ, చిరంజీవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తెకు వివాహం అయిపోయింది. రెండో కూతురుకు 20 రోజుల కిందట అదే గ్రామానికి చెందిన వేరే కులం వ్యక్తితో వివాహం జరిగింది. ఈ వివాహం జరగడంలో చిరంజీవి భార్య సన్యాసమ్మ కీలక పాత్ర పోషించింది. ఇది భర్తకు నచ్చలేదు. ఈ విషయం మీద తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కత్తితో సన్యాసమ్మ భర్తను కిరాతకంగా హత్యచేసింది.

చిరంజీవి అదే గ్రామంలో కౌలురైతుగా పనిచేస్తున్నాడు. పొలం పొదల మధ్య భర్తను హత్య చేసినట్టు భార్య సన్యాసమ్మ వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. కూతురు వివాహ వ్యవహారంలో అన్యోన్యంగా ఉండే ఆ భార్యాభర్తల మధ్య జరిగిన ఈ విషాద ఘటన ఆ గ్రామ ప్రజలను విస్మయానికి గురిచేసింది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు..ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details