ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్న వివాదంతో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి - suicide attempt news

విశాఖ జిల్లా పూసలపూడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చిన్న వివాదం ఇందుకు కారణమని స్థానికులు తెలిపారు. భర్త మృతి చెందగా భార్య చికిత్స పొందుతోంది.

suicide attempt
స్వల్ప వివాదంతో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

By

Published : Apr 18, 2021, 11:43 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలంలోని పూసలపూడి గ్రామానికి చెందిన ప్రేమికులిద్దరు కులాంతర వివాహం చేసుకుని స్వగ్రామంలోనే కాపురం పెట్టారు. వారికి 3 నెలల పసిపాప ఉంది. శనివారం రాత్రి భార్యభర్తలకు ఇంట్లో స్వల్ప ఘర్షణకు జరిగిందని స్థానికులు తెలిపారు. చివరికి అది వివాదంగా మారి ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త సురేశ్​ ప్రాణాలు కోల్పోగా.. అపస్మారక స్థితికి చేరుకున్న భార్య కృపా కమలను విశాఖ కేజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. మృతుడు సురేశ్ తండ్రి నానాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details