ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సారాలో పురుగు మందు కలిపి..భర్తను కడతేర్చిన భార్య - visakha agency wife murdered husband news today

నాటు సారాలో పురుగుల మందు కలిపి భర్తను హత్య చేసిన ఘటనలో పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం కొయ్యూరు మండలం భీమవరం గ్రామంలో జరిగింది.

శాడిస్ట్ భర్తను హత్య చేసిన కేసులో భార్య అరెస్ట్
శాడిస్ట్ భర్తను హత్య చేసిన కేసులో భార్య అరెస్ట్

By

Published : Sep 26, 2020, 8:13 PM IST

Updated : Sep 27, 2020, 11:41 AM IST

విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం కొయ్యూరు మండలం భీమవరం గ్రామంలో నాటు సారా తాగి ఇద్దరు మృత్యువాత పడిన కేసును పోలీసులు ఛేదించారు. అరెస్ట్ చేశారు. తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం జనమూరి బాలరాజు హత్య కేసులో భార్య మల్లమ్మ నిందుతురాలని గుర్తించారు. కొయ్యూరు సీఐ ఎస్ వెంకటరమణ పర్యవేక్షణలో ఎస్సై నాగేంద్ర దర్యాప్తు చేశారు.

భర్త అరాచకాలు..

తాళి కట్టించుకున్న పాపానికి నిత్యం తప్ప తాగుతూ ఐదేళ్లుగా వేధిస్తూనే ఉన్నాడని నిందితురాలు తెలిపింది. భర్త అరాచకాలను ఇక ఏమాత్రం భరించలేకపోయాయని.. నరక ఊబిలో నుంచి వెంటనే బయటకు వచ్చేయాలని భావించినట్లు పేర్కొంది. అందుకే భర్త రోజు తాగే నాటుసారాలోనే పురుగుల మందు కలిపినట్లు స్పష్టం చేసింది.

మానసిక, శారీరక హింస..

జనమూరి బాలరాజు, మల్లయ్యమ్మ పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐదు సంవత్సరాల వరకు భార్యాభర్తలు బాగానే కాపురం చేశారు. ఫలితంగా వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. క్రమేపీ బాలరాజు మద్యానికి బానిసై భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించాడు.

విసిగి వేసారి..

ఇటీవలే కాలంలో వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో విసిగిపోయిన భార్య.. తన పిల్లల భవిష్యత్ కోసం భర్త నుంచి విముక్తి పొందాలనుకుంది. ఈ క్రమంలో బాలరాజు రోజు తాగే నాటుసారాలో పురుగుల మందు కలిపింది. విషయాన్ని గమనించని బాలరాజు.. తన స్నేహితుడు పైలా వెంకటరత్నం నాయుడుతో కలిసి నాటుసారా సేవించాడు. ఫలితంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. నేరం అంగీకరించిన మల్లమ్మను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి:

తెలంగాణ: హేమంత్ కు కన్నీటి వీడ్కోలు

Last Updated : Sep 27, 2020, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details