ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి - visakha district latest news

వారిద్దరూ ఆన్యోన్యంగా జీవించారు. మూడుముళ్లబంధంతో అయిదున్నర దశాబ్దాలు కలిసి జీవించారు. అంతేకాదు మరణం కూడా ఆ భార్యభర్తలను విడదీయలేకపోయింది. కాకపోతే భార్య ముందుగా చనిపోవడంతో దహనక్రియలు కానిచ్చి ఇంటికి వచ్చి ప్రాణాలు వదిలాడు ఆ భర్త. ఒకే రోజు గంటల వ్యవధిలో భార్యభర్తలు మృతి చెందడం అందర్నీ కలిచివేసింది. బుచ్చెయ్యపేట మండలంలోని కుముందానిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది.

couple photo
మృతిచెందిన వృద్ధ దంపతులు

By

Published : Sep 8, 2020, 10:47 PM IST

విశాఖ జిల్లా కుముందానిపేట గ్రామంలో పొలమరశెట్టి సన్యాసినాయుడు, మంగతల్లి భార్యభర్తలు. వీరికి అయిదుగురు సంతానం. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో మంగతల్లి (63) మృతి చెందింది. శ్మశానవాటికలో మంగతల్లి దహనక్రియలు పూర్తి చేసి అందరూ ఇంటికొచ్చారు. భార్య మృతి చెందిందన్న బాధతో ఉన్న సన్యాసినాయుడు ఇంటికి రాగానే ప్రాణాలు వదిలాడు. ఈ పరిణామంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంగతల్లి ని శ్మశానవాటికకు తీసుకెళ్లిన వారంతా సన్యాసినాయుడు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details