ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పీఆర్​ఓ ఉండగా మళ్లీ నియామకాలు ఎందుకు'

సింహాద్రి అప్పన్న సన్నిధిలో కొత్తగా పీఆర్ఓ సహా ఓ ఫోటోగ్రాఫర్​ను దేవస్థానం బోర్డు నియమించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో అప్పన్న ఖజానాపై ప్రతి నెలా రూ.75 వేల ఆర్థిక భారం పడనుంది.

'అప్పన్నపై భారం : పీఆర్​ఓ ఉండగా మళ్లీ నియామకాలు ఎందుకు'
'అప్పన్నపై భారం : పీఆర్​ఓ ఉండగా మళ్లీ నియామకాలు ఎందుకు'

By

Published : Apr 13, 2021, 7:52 PM IST

విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో కొత్తగా ఆలయ పీఆర్ఓ ఫోటోగ్రాఫర్లను దేవస్థానం నియమించింది. ప్రతి నెలా పీఆర్వోకు రూ. 50 వేలు, ఫోటోగ్రాఫర్​కు రూ.25 వేలు చెల్లించేందుకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపిందని ఆలయ ఈవో సూర్య కళ తెలిపారు.

'ఆదాయానికి గండి'

రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు కరోనా సమయంలో ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనే అంశంపై దృష్టి పెడితే.. సింహాచల దేవస్థానం మాత్రం ఇందుకు విరుద్ధంగా డబ్బును ఎలా ఖర్చు చేయాలని చూస్తోంది. అవసరం లేని చోట సిబ్బందిని నియమించుకోవడం ద్వారా అప్పన్న ఆదాయానికి అధికారులు గండి కొడుతున్నారు.

బోర్డ్ ఆదేశాల మేరకే..

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆలయంలో ఫోటోగ్రాఫర్​ను నియమించారు. ఈ విషయంపై ఈవోను పాత్రికేయులు ప్రశ్నించగా.. బోర్డు ఆదేశాల మేరకే నియామకాలు చేసినట్లు పేర్కొన్నారు. ఆలయంలో ప్రస్తుతం పర్మినెంట్ పీఆర్ఓగా ఓ అధికారి ఉన్నారని.. ఇప్పుడు ఈ తాత్కాలిక పీఆర్​ఓని నియమించడం వెనక ఉద్దేశం ఏమిటో దేవస్థాన అధికారులు చెప్పాలని స్థానిక విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.

'ఆదాయం లేని సమయంలో ఎందుకు'

గత ట్రస్ట్ బోర్డు సమావేశంలో నిధులు లేవని.. తాత్కాలికంగా మెట్ల మార్గంలో ఆలయ నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని ట్రస్ట్ బోర్డు ఆమోదించింది. ప్రస్తుతం ఆదాయం లేని సమయంలో ఈ నియామకాలు ఎందుకు చేపట్టారని విశ్వహిందూ పరిషత్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

'టెండర్ వేసి తీసుకోవాలి'

ఒక తాత్కాలిక ఉద్యోగిని విధుల్లోకి తీసుకోవాలంటే టెండర్ వేసి నియమించాలనే నిబంధన దేవాదాయ శాఖలో ఉందని పేర్కొన్నారు. కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా తాత్కాలిక ఉద్యోగులను ఎలా భర్తీ చేశారని పరిషత్ నేతలు నిలదీస్తున్నారు. టెండర్ నోటీస్ ఇవ్వకుండా ఇద్దరు ఉద్యోగులను ఎలా తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మాఫీ చేసిన డబ్బుతో జీతాలు..

కరోనా సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని.. విద్యుత్ శాఖకు బకాయి పడ్డ రూ. 5 కోట్లను మాఫీచేసిన డబ్బుతో జీతాలు తీసుకుంటున్న తరుణంలో ప్రస్తుతం నియామకాలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : సీఎం ప్రోద్భలంతోనే చంద్రబాబుపై దాడులు: కళా

ABOUT THE AUTHOR

...view details