ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. శిలాఫలకం ఆవిష్కరించారు. ఆరోగ్య కేంద్రం ద్వారా మరిన్ని వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఆరోగ్యకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన - Whip Muthyalanayudu news
విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు.
శంకుస్థాపన చేసిన విప్ ముత్యాలనాయుడు