ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Police Notice: అయ్యన్న ఇంటికి పోలీసు నోటీసులు.. ఎందుకంటే ? - అయ్యన్న ఇంటికి పోలీసులు

సీఎం జగన్​ను అసభ్య పదజాలంతో దూషించారన్న కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడుకి నోటీసులు ఇచ్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు విశాఖలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అయ్యన్న ఇంట్లో లేరని తెదేపా కార్యకర్తలు చెప్పటంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు.

అయ్యన్న ఇంటికి పోలీసులు
అయ్యన్న ఇంటికి పోలీసులు

By

Published : Feb 23, 2022, 12:02 PM IST

Updated : Feb 23, 2022, 12:54 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజెర్ల నుంచి సీఐ రఘు, ఎస్‌ఐలు శ్రీహరిరావు, అవినాష్‌తో పాటు పోలీసు సిబ్బంది వచ్చారు. అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేరని చెప్పినా.. పోలీసులు వినిపించుకోలేదు. అయ్యన్న ఇంట్లోనే ఉన్నారని.. బయటికి వస్తే నోటీసులు ఇచ్చి వెళ్లిపోతామని అన్నారు. చాలా సేపు అక్కడే వేచి ఉన్న పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు.

నోటీసులు ఎందుకంటే..

ఇటీవల నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు... ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా నాయకుడు రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నల్లజెర్ల పోలీసులు అయ్యన్నపాత్రుడిపై 153ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

Last Updated : Feb 23, 2022, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details