విశాఖ జిల్లా అనకాపల్లిలో జనవరి 30వ తేదీన గంజాయి తరలిస్తూ తప్పించుకున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అనకాపల్లిలో గత నెల 30న మాటు వేశారు. విషయం తెలుసుకున్న నిందితులు పోలీసు వాహనాన్ని తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించినప్పటికీ నిందితులు దొరకలేదు. సరుకు ఉన్న వ్యాన్ను వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. 640 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. ఇవాళ నిందితులను పట్టుకున్నారు. దొరికిన సరకు విలువ రూ.33 లక్షలు ఉంటుందని సీఐ భాస్కర్రావు తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుల అరెస్ట్ - weed smugglers arrested in visakha dst anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లిలో గంజాయి అక్రమ రవాణా చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గత నెల 30వ తేదీన పోలీసుల నుంచి తప్పించుకున్న స్మగ్లర్లు వ్యాన్ను వదిలేసి పరారయ్యారు.
గంజాయి అక్రమరవాణాకేసులో నిందితులు అరెస్ట్