విశాఖ జిల్లా పాడేరు నుంచి వైజాగ్ వెళ్లే ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని డ్రైవర్ గుర్తించాడు. గంజాయి బ్యాగు ఎవరిదో తెలియకపోవటంతో..వాటిని పాడేరు ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎక్సైజ్ సిబ్బందికి సమాచారమివ్వగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో సుమారు 40 కేజీల గంజాయి ఉంటుందని గుర్తించి.. సరుకును స్వాధీనం చేసుకున్నారు.
ఆర్టీసీ బస్సులో గంజాయి..40 కిలోల సరుకు స్వాధీనం - weed at visakha district paderu
ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిను బస్సు డ్రైవర్ గుర్తించి పట్టుకున్నాడు. ఎక్సైజ్ సిబ్బందికి సమాచారమిచ్చి గంజాయిని అప్పగించారు. గంజాయి సుమారు 40 కిలోలు ఉంటుందని అదికారులంటున్నారు.
![ఆర్టీసీ బస్సులో గంజాయి..40 కిలోల సరుకు స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4648616-932-4648616-1570184861574.jpg)
పాడేరు ఆర్టీసీలో గంజాయి కలకలం....