AP Weather: నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని తెలియచేసింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
అల్పపీడన ప్రభావం.. ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు - అమరావతి వాతావరణ కేంద్రం
AP Weather: అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 10, 11న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
దక్షిణ కోస్తాంధ్ర-తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణా సంస్థ తెలిపింది. లోతట్టుప్రాంత ప్రజలు, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడవద్దని సూచించింది.
ఇవీ చదవండి:
Last Updated : Nov 9, 2022, 7:47 PM IST