విశాఖ పార్లమెంట్ స్థానంతోపాటు భీమిలి అసెంబ్లీ స్థానాన్ని గెలిచి అధినేత చంద్రబాబుకు బహుమానంగా ఇస్తామని తెదేపా కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.
తెదేపా కార్యకర్తల ప్రచారం
By
Published : Mar 25, 2019, 5:14 PM IST
తెదేపా కార్యకర్తల ప్రచారం
విశాఖ జిల్లా భీమిలిలో తెదేపా అభ్యర్థుల తరఫున కార్యకర్తలు ప్రచారం చేశారు. భీమిలి తెదేపా పట్టణ అధ్యక్షుడు గంట నూకరాజుతో పాటు నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిందారు. పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలు.. తెదేపా అనుకూల నినాదాలతో హోరెత్తించారు. భీమిలి శాసనసభనియోజకవర్గ అభ్యర్థి సబ్బంహరిని, విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ భరత్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబుకు బహుమానంగా ఇస్తామని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.