విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద శారదా నదిపై అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి తాత్కాలికంగా రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. నదిపై ఉన్న కాజ్వే.. రైవాడ జలాశయం వరదనీటికి కొట్టుకుపోయింది. దీంతో అనంతగిరి, హుకుంపేట మండలాలకు చెందిన వంద గ్రామాల గిరిజనుల రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాజ్ వే, అసంపూర్తిగా ఉన్న వంతెనను పరిశీలించిన ముత్యాల నాయుడు...తాత్కాలికంగా రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
'శారదా నది వంతనపై నుంచి రాకపోకలకు చర్యలు తీసుకుంటాం' - విప్ ముత్యాల నాయుడు న్యూస్
శారదా నదిపై విశాఖ జిల్లా దేవరాపల్లి వద్ద అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి తాత్కాలికంగా రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. కాజ్ వే, అసంపూర్తిగా ఉన్న వంతెనను పరిశీలించిన ఆయన సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు.

శారదా నది వంతనపై నుంచి రాకపోకలకు చర్యలు తీసుకుంటాం