ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ ఉక్కు ఉద్యమాన్ని సమ్మెబాట పట్టిస్తాం' - విశాఖ ఉక్కు తాజా వార్తలు

విశాఖ ఉక్కు ఉద్యమాన్ని సమ్మెబాట పట్టిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. పరిశ్రమ ఆస్తుల పరిరక్షణ.. నిర్వాసితుల సమస్యల పరిష్కారం సహా మొత్తం 5 డిమాండ్లను..ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నోటీసులో ప్రస్తావించింది. 14 రోజుల్లో నిర్ణయం తీసుకోకుంటే.. ఏ క్షణమైనా సమ్మె సైరన్ మోగిస్తామని హెచ్చరించారు.

'విశాఖ ఉక్కు ఉద్యమాన్ని సమ్మెబాట పట్టిస్తాం'
'విశాఖ ఉక్కు ఉద్యమాన్ని సమ్మెబాట పట్టిస్తాం'

By

Published : Mar 12, 2021, 3:01 AM IST

Updated : Mar 12, 2021, 6:50 AM IST

'విశాఖ ఉక్కు ఉద్యమాన్ని సమ్మెబాట పట్టిస్తాం'

విశాఖ ఉక్కు పోరాటంలో కార్మికులు, ఉద్యోగులు పూర్తి స్థాయిలో పాల్గొనే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ మేరకు.. సంస్థ సీఎండీ పీకే రథ్‌కు గురువారం కార్మిక సంఘాలు నోటీసు ఇచ్చాయి. 2 రోజుల కిందట నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు..ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ 5 అంశాలను ప్రస్తావిస్తూ యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు ఈ నెల 25 నుంచి ఎప్పుడైనా సమ్మెబాట పడతామని హెచ్చరించింది.

లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో ఒక్కసారిగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం అదుపులోకి వచ్చినా..ఏ క్షణమైనా రోడ్డెక్కుతామని కార్మికులు అంటున్నారు. కర్మాగారంలో ఉత్పత్తిపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతనూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దృష్టిలో పెట్టుకుంది. పరిశ్రమ కోసం త్యాగాలు చేసిన నిర్వాసితుల నుంచి ఒప్పంద కార్మికులు, సంస్థ పురోగతిలో భాగస్వాములుగా ఉంటున్న ప్రతి ఒక్క వర్గానికి భరోసా కల్పించే దిశగా నోటీసులో అంశాలను జతచేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం, పెట్టుబడుల ఉపసంహరణ దిశగా కర్మాగారంలో అంతర్గతంగా ఏర్పడిన అధ్యయన బృందాన్ని రద్దుచేయడం, జాయింట్ వెంచర్గా​ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం పోస్కో సంస్థతో చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని నోటీసులో స్పష్టం చేశారు. వీటితో పాటు మద్దిలపాలెం వద్ద ఉన్న విలువైన భూములపై ఎన్బీసీసీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందేనని నోటీసులో పేర్కొన్నారు. ఆర్ కార్డు కలిగి ఉండి నేటికీ ఉద్యోగం లేకుండా ఉన్న నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలని అందులో వెల్లడించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా.. ప్రభుత్వ సంస్థల్లో ధర్నాలకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు ఇచ్చింది. ఈ నెల 20న స్టీల్‌ ప్లాంట్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.

ఇవీ చదవండి

'అందరి ఆమోదంతో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరుగుతుంది'

Last Updated : Mar 12, 2021, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details