విశాఖ జిల్లా మన్యంలో జాతీయ రహదారి నిర్మాణంతో హుకుంపేట, అరకులోయ, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాలలో చాలామంది భూములు కోల్పోతున్నారు. వీరికి నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు కిల్లో సురేంద్ర ఐటిడిఎపివో డాక్టర్ వెంకటేశ్వర్కు వినతి పత్రం సమర్పించారు. దీనిని ఉద్దేశించి ఐటీడీఏ పీవో ప్రకటన జారీ చేసారు.
భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తాం - paderu tribal people protest on lands
విశాఖ మన్యంలో జాతీయ రహదారి 516 నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి నష్టం కలగకుండా చూస్తామని పాడేరు ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహరం అందిస్తాం
గిరిజనులు ఎవరు నష్టపోకుండా చూస్తామన్నారు. మెరుగైన నష్టపరిహారం అందిస్తామన్నారు. జాతీయ రహదారి నిర్మాణం వలన గిరిజన ప్రాంతంలో మండల ప్రధాన గ్రామాలకు మంచి రహదారి వస్తుందన్నారు. 30 ఏళ్ల తర్వాత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయ రహదారి నిర్మాణం అవుతుందన్నారు. గిరిజనులు ఎవరూ భయపడాల్సినవసరం లేదని ఐటిడిఎ పిఓ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
ఇవీ చదవండి