ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"భీమిలికి వెళ్తే తెలుస్తుంది గంటా ఎంత కబ్జా చేశారో"

తమ ప్రభుత్వం అభివృద్ధికి వ్యతిరేకం కాదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజధాని, పోలవరంపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. విశాఖ భూ కబ్జాలపై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశిస్తుందని వెల్లడించారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

అవంతి వర్సెస్ గంటా

By

Published : Sep 6, 2019, 11:37 PM IST

గంటా శ్రీనివాసరావుపై మంత్రి సెటైర్లు

వందరోజుల వైకాపా పాలనపై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పోలవరం, అమరావతి ఆపేశామని తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్​ను విమర్శించే అర్హత లోకేశ్​కు లేదన్నారు. విశాఖ భూ అక్రమాలపై సిట్ పునర్ విచారణ చేస్తుందని తెలిసే ముఖ్యమంత్రికి గంటా శ్రీనివాసరావు లేఖ రాశారని అన్నారు. గంటా శ్రీనివాస్, ఆయన అనుచరులు ఎంత భూమిని కబ్జా చేశారో భీమిలికి వెళ్లి అడిగితే ఎవరైనా చెప్తారని అన్నారు. సిట్ నివేదికలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. కొంత మంది దొడ్డిదారిన వైకాపా, భాజపాలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులెవర్నీ తీయమని మంత్రి అవంతి స్పష్టం చేశారు. విశాఖ వైకాపా కార్యాలయంలో జగన్ వంద రోజులు పాలన పూర్తైన సందర్భంగా కేక్ కోసి మంత్రి అవంతి శ్రీనివాసరావు వేడుక చేశారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details