న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు హైకోర్టు నుంచి నోటీసులందుకున్న వారందరికీ అండగా ఉంటామని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కేసుల్లో ఇరుక్కున్నంత మాత్రాన కార్యకర్తలను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. తెదేపా కార్యకర్తల కవ్వింపులతోనే వైకాపా ప్రభుత్వ సానుభూతిపరులు అలాంటి పోస్టులు పెట్టారని ఆయన అన్నారు. అంతేకానీ న్యాయవ్యవస్థను కించపరిచే ఉద్దేశం ఏ ఒక్క వైకాపా కార్యకర్తకు లేదని చెప్పారు.
వైకాపా సోషల్ మీడియా విభాగాన్ని తానే చూసుకుంటున్నానని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా ఇలాంటి కేసులే తెదేపా కార్యకర్తలపై పెడితే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని అన్నారు. మరోవైపు తన పేరు మీద ఫేక్ అకౌంట్స్ పెట్టి.. కొందరు సీఎం జగన్ను దూషించిన పోస్టులు పెట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.