విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం సత్యవరం గ్రామానికి చెందిన దళితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేటాయిస్తున్న ఇళ్ల స్థలాల జాబితాలో సర్వే పేరుతో గ్రామానికి చెందిన వారి పేర్లను అధికార పార్టీ నాయకులు తొలగించారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో ఇంట్లో పదిమంది వరకు నివాసం ఉంటున్నామని, కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
'ఇళ్ల స్థలాల కేటాయింపులో మాకు అన్యాయం జరిగింది' - unfairly in the allocation of housing space said by dalits in payakaraopeta
అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని కోరుతూ విశాఖ జిల్లా సత్యవరం గ్రామానికి చెందిన దళితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సర్వే పేరుతో తమ పేర్లను అధికార పార్టీ నాయకులు తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇళ్ల స్థలాల కేటాయింపులో మాకు అన్యాయం జరిగింది