ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేయి చేయి కలిపారు.. ట్యాంకు శుభ్రం చేశారు - పాడేరులో మంచినీటి ట్యాంకును శుభ్రం చేసిన గ్రామస్థులు

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆ గ్రామస్థులు భావించలేదు. మన సమస్యను మనమే పరిష్కరించుకుందామనుకున్నారు. తలా ఓ చేయి వేసి ఆ పని పూర్తి చేశారు.

water tank clean by villagers in paderu vizag district
చేయి చేయి కలిపారు.. ట్యాంకు శుభ్రం చేశారు

By

Published : Jun 1, 2020, 4:29 PM IST

విశాఖ మన్యం పాడేరు మండలం గుర్రగరువులో మంచినీటి ట్యాంకు అపరిశుభ్రంగా తయారైంది. దాన్ని శుభ్రం చేయాలని గ్రామంలోని యువకులు భావించారు. అందుకోసం అధికారులకు అర్జీలు పెట్టలేదు... గ్రామస్థుల్ని సమీకరించారు. అందరూ కలిసి సమష్టిగా ట్యాంకును శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు పరిశుభ్రమైన నీరు తాగుతున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కూర్చోకుండా మనకు సాధ్యమైనంతలో సమస్యల్ని మనమే పరిష్కరించుకోవచ్చని చాటిన ఆ గ్రామస్థులు అభినందనీయులు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details