ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యం తడిసి ముద్దవుతోంది. ఏకధాటిగా పడుతున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమా జలాశయం ప్రమాదకర స్థాయికి చేరింది. 2590 అడుగుల సామర్థ్యం కలిగిన డుడుమాలో నీటి మట్టం 2589.9 అడుగులకు చేరింది. దీంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఎగువున ఉన్న జోలపుట్ జలాశయం నుంచి నీటి విడుదల నిలిపివేశారు.
ప్రమాదకర స్థాయికి డుడుమా జలాశయ నీటిమట్టం.. దిగువకు నీరు విడుదల - డుడుమా జలాశయం
విశాఖ జిల్లాలోని డుడుమా జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయం నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో 2 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
![ప్రమాదకర స్థాయికి డుడుమా జలాశయ నీటిమట్టం.. దిగువకు నీరు విడుదల water released from duduma reservoir vizag district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8401211-262-8401211-1597304461068.jpg)
డుడమా జలాశయం