విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి రాచకట్టు సాగునీటి కాలువ తాటి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. జలాశయం పరిధిలోని రాచకట్టు సాగునీటి కాలువ ఆయకట్టకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. దీంతో రైతులు రబీ సాగుకు సిద్ధమయ్యారు.
పెద్దేరు జలాశయం నుంచి నీటి విడుదల.. హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు - Visakhapatnam latest news
విశాఖ జిల్లాలోని పెద్దేరు జలాశయం నుంచి 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదల పట్ల రాచకట్టు కాలువ సాగు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దేరు జలాశయం నుంచి నీటి విడుదల
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా.. ప్రస్తుతం 136.05 మీటర్ల నీరు ఉంది. ప్రాజెక్టులో సమృద్ధిగా నీటి నిల్వ ఉండటంతో సాగునీటి డోకా ఉండదని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.