ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిండుకుండలా డొంకరాయి జలాశయం.. రెండు గేట్ల ద్వారా నీటి విడుదల

గత రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్స్​లోని డొంకరాయి జలాశయానికి పూర్తిస్థాయిలో నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు... ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 6,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

water release from donkarai project
నిండుకుండలా డొంకరాయి జలాశయం

By

Published : Sep 5, 2021, 4:33 PM IST

నిండుకుండలా డొంకరాయి జలాశయం

విశాఖ జిల్లా.. సీలేరు కాంప్లెక్సులోని డొంకరాయి జలాశయం నుంచి 6,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా డొంకరాయి జలాశయం పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా..1036.5 అడుగులకు నీరు వచ్చింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా జెన్‌కో అధికారులు.. రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వలసగెడ్డ, పాలగెడ్డ వాగులతోపాటు సమీప కొండ ప్రాంతాల నుంచి పది వేలకు క్యూసెక్కులకు పైగా వరదనీరు జలాశయలోకి చేరిందని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు ఎస్‌ఈ రామకోటిలింగేశ్వరరావు తెలిపారు. జలాశయం నీటిమట్టం 1036 అడుగులు కొనసాగేలా.. రెండు గేట్లు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నాం. మరోవైపు పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తికి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని పవర్‌ కెనాల్‌ ద్వారా విడుదల చేస్తున్నాం. శనివారం పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో 2.2 మిలియన్‌ యూనిట్లు విద్యుదుత్పత్తి జరిగిందని ఎస్‌ఈ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details