విశాఖ జిల్లా చోడవరం మండలంలో 2వేల 145 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుంటారు. ఇప్పటికి 16 వందల 23 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. రైవాడ జలాశయం నీరు అందక అన్నవరం, సబ్బవరపుకళ్లాలు, రేవళ్లు తదితర ప్రాంతాల్లో వేసిన నాట్లను రక్షించుకునే పనిలో పడ్డారు రైతులు. బోర్లున్నచోట నీటిని అద్దెకు తెచ్చుకునే పనిలో రైతాంగం ఉంది. చోడవరం, అన్నవరం, సబ్బవరపు కళ్లాలలో నాట్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితిని చూసి మరికొన్ని ప్రాంతాల్లో వరినాట్లు వేయడం మానేసి.. భూములను ఖాళీగా వదిలేశారు.
సాగుకు అందని నీళ్లు...ఆందోళనలో రైతాంగం - News of the plight of farmers without water for crops in Visakhapatnam
విశాఖ గ్రామీణ జిల్లాలో రైతులు వర్షాలకై ఆకాశం వైపు చూస్తున్నారు. వేసిన వరినాట్లకు సాగునీరందక ఎండుతున్నాయి. మరికొన్ని చోట్ల నీరులేక పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బుచ్చయ్యపేట మండలంలో ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు రైతులు నాట్లు వేశారు. తీరా ఇప్పుడు నీరు లేక ఎర్రవాయి ప్రాంతంలో వేసిన నాట్లు ఎండిపోతున్నాయి. పొలాలు బీటలుగా మారుతున్నాయి.
![సాగుకు అందని నీళ్లు...ఆందోళనలో రైతాంగం నీరు లేక ఎండుతున్న వరి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8711354-118-8711354-1599471792466.jpg)
నీరు లేక ఎండుతున్న వరి
ఇవీ చదవండి